తెలుగు ముఖ్యమంత్రుల కీలక భేటీ
1 min readరెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలక సమావేశం జరగబోతుంది. ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొంటున్నారు. సమావేశంలో చర్చించాల్సిన అజెండా ను రెండు రాష్ట్రాలు ఖరారు చేసుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు
1.రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కలుపబడ్డ 7 మండలాలు తిరిగి తెలంగాణలో చేర్చాలి.
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000కి.మీ మేర విస్తారమైన తీరప్రాంతం (Coastal Corridor) ఉంది. తెలంగాణకు ఈ తీరప్రాంతంలో భాగం కావాలి.
3. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి. తెలంగాణకు కూడా టీ.టీ.డీ.లో భాగం కావాలి.
4. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీ నీటిని కేటాయింపు చేయాలి.
5. తెలంగాణ విద్యుత్ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే, వాటిని చెల్లించడం జరుగుతుంది.
6. తెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్ లో భాగం కావాలి.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అంశాలు…
1.షెడ్యల్ 9 లోని ఆస్తుల విభజన
2.షెడ్యూల్ 10లోని ఆస్తుల విభజన
3.చట్టంలో పేర్కోనబడని ఆస్తుల విభజన
4.ఏపి స్టేట్ ఫైనాన్సియల్ కార్పోరేషన్ ఇష్యూ
5.విద్యుత్ బకాయిలు
6. పదిహేను ఎక్సట్రనల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పల పంపిణీ
7.ఉద్యోగుల మార్పిడి
8.లేబర్ సెస్ పంపిణీ
9.ఉమ్మడి సంస్ధల కు ఖర్చు చేసిన సోమ్మును తిరిగి చెల్లించడం
10.హైదరాబాద్ లోని మూడు భవనాలను నిలుపుదల చేయడం
షెడ్యూల్ 9 సంస్ధలు…
మొత్తం 91 సంస్ధలలో 89 సంస్ధల కేంద్ర సముధాయాలు పంపిణీకి షీలా భేడీ కమీటి సిఫారస్సులు
అన్ని ఈసీ సిఫారస్సులను 89 సంస్ధల విషయంలో ఓకే చెప్పిన ఏపి
ఈసీ సిఫారస్సులలో 68 సంస్ధల విషంలోనే అంగీకారం తెలిపిన తెలంగాణ
ఏపి తరపున రేపు మీటింగ్ లో పాల్గోనే వారు సిఎం చంద్రబాబు తోపాటు సిఎస్, ముగ్గురు మంత్రులు, ఆర్ధిక, ఇతర శాఖల కార్యదర్శులు
ఏపి తరపున రేపటి ఇరు రాష్ట్రా ముఖ్యమంత్రుల సమావేశానికి రివెన్యూ శాఖామంత్రి అనగాని సత్య ప్రసాద్ , రోడ్లు భవనాలు శాఖామంత్రి బిసి జనార్ధన రెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గెష్ హజరు