మా నాన్నను పోలీసులు ఇంటికి పంపించారు
1 min readబోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన నంధ్యాల టీడీపీ నేత ఎవీ సుబ్బారెడ్డిని పోలీసులు వదిలేశారు. రాత్రి అరెస్టు చేసిన తర్వాత ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత ఆయనను పంపించి వేసినట్లు తెలుస్తోంది. ఎవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి రెడ్డి తన తండ్రిని పోలీసులు పంపించి వేశారని ఫేస్ బుక్ లో వీడియో పోస్టు చేశారు. ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్దారించుకున్నారని ఆమె చెప్పారు . తెలంగాణ పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఎవీ సుబ్బారెడ్డిని మాదాపూర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాదితులు ఇచ్చిన ఫిర్యాదు కారణంగానే ఎవీని పోలీసులు పట్టుకున్నారు. అయితే భూమా అఖిలప్రియతో తనకు మాటలు లేవని, ఆమెతో కలిసి కుట్ర చేశారనడంతో అర్థం లేదని సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. మరో వైపు ఈ కేసులో అఖిలప్రియ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆమె భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలో ఉన్నారు.