తాడిపత్రిలో భూమా అఖిలప్రియ
1 min read
మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి నేపథ్యంలో జెపి బ్రదర్స్ కి తెలుగుదేశం నేతలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. అనంతపురంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి నాయకులు ప్రభాకర్ రెడ్డిని కలిసి తమ మద్దతు తెలియజేస్తున్నారు. పార్టీ యావత్తు అండగా ఉంటుందనే సంకేతాలను జేసి సోదరులకు నేతలు తెలియజేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి , కర్నూలు జిల్లాకు చెందిన ముఖ్యనాయకురాలు భూమా అఖిలప్రియ తాడిపత్రి వెళ్లారు. జెసి ప్రభాకర్ రెడ్డిని కలిసి ఆమె సంఘీభావం తెలిపారు. వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.