మల్లారెడ్డి హల్చల్
1 min readమల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుచిత్రలోని ఓ స్థలం విషయంలో ఆయనతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి వివాదానికి దిగారు. తన భూమిని ఆక్రమించుకున్నారంటు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు అక్కడ ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేశారు. పోలీసులు వారిస్తున్నప్పటికి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి పట్టించుకోలేదు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మర్రి ని అదుపులోకి తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.