కేసీఆర్ కు షాక్.. కాంగ్రెస్ లోకి గుత్తా అమిత్ రెడ్డి
1 min readనల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి. కేసీఆర్ వైఖరి పైన గుత్తా సుఖేందర్ రెడ్డి గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన కుమారుడికి ఎమ్మెల్యే , ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీరు పైన కూడా గుత్తా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని కాంగ్రెస్ లోకి ఆయన పంపించారు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా ఉన్న సుఖేందర్ రెడ్డి పార్టీలకు దూరంగా ఉండనున్నారు.