ఐఏఎస్ ల బదిల్లీల్లో రేవంత్ రెడ్డి మార్క్  

1 min read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఐఏఎస్ ల బదిలీ పైన ఆయన దృష్టి సారించారు. ప్రధానంగా విద్యుత్ శాఖను పూర్తిగా పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఈ శాఖలోని ఉన్నతాధికారులను పూర్తిగా తొలగించారు. కీలక స్థానాలను  ఐఏఎస్ లకు అప్పగించారు. ట్రాన్స్ కో,జెన్ కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్వి ని నియమించారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ గా ముషారఫ్ అలీ, ట్రాన్స్ కో జేఎండీ గా సందీప్ కుమార్ ఝా, టీఎస్ఎన్ పీడీపీఎల్ సీఎండీగా వరుణ్ రెడ్డి ని అపాయింట్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి గా  శైలజా రామయ్యర్ , డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్డీగా క్రిష్ణ భాస్కర్  . హెచ్ఎండీఏ కమిషనర్ గా అమ్రపాలి, అగ్రికల్చర్ డైరెక్టర్ గా బీ గోపిని నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn