దయచేసి ఆస్పత్రికి రావొద్దు
1 min readయశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆస్పత్రి ముందు హడావుడి నెలకొన్నది. కేటీఆర్ వారందరిని సముదాయిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా అనేక మంది ప్రముఖులు ఇప్పటికే కేసీఆర్ ను పరామర్శించారు. మరో వైపు నాయకులు,జనం పెద్ద ఎత్తున తరలి వస్తుండటం పైన డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్ స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. పరామర్శకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దని ఆయన కోరారు. త్వరలో తానే ప్రజల దగ్గరకు వస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.