ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
1 min readతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో రోజునే ఆయన హస్తిన బాట పట్టడం విశేషం. మంత్రులకు శాఖల కేటాయింపు పైన ఆయన అధిష్టానంతో చర్చిస్తారు. రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గంలోకి 10 మందిని తీసుకున్నారు. సీనియర్ నాయకులకు క్యాబినెట్ లో అవకాశం ఇచ్చారు. వీరికి శాఖల కేటాయింపు సవాల్ గా మారింది. దీంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తో పాటు ఇతర ఇతర నాయకులతో దీనిపై చర్చిస్తారు.