గన్ మెన్ కు హోంమంత్రి క్షమాపణ

1 min read
  తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ కు క్షమాపణ చెప్పారు. అనుకోకుండా జరిగిన సంఘటనకు చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు వేడుకల్లో హోంమంత్రి తన గన్ మెన్ చెంప చెళ్లుమనిపించారు. సమయానికి బోకే చేతికి ఇవ్వలేదన్న కారణంతో మహమూద్ అలీ గన్ మెన్ పైన చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో హోంమంత్రిని కడిగిపారేశారు. దీంతో మహమూద్ అలీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn