కాంగ్రెస్ లోకి గద్వాల జడ్పీ ఛైర్ పర్సన్
1 min readగద్వాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె భర్త తిరుపతయ్య కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రెండు రోజుల క్రితమే వీరిద్దరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి తో వీరికి విభేదాలున్నాయి. ఎమ్మెల్యే వైఖరీతో వీరు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గద్వాలలో డీకె అరుణ బీజేపీలో చేరిన తర్వాత అక్కడ కాంగ్రెస్ కు సరైన నాయకత్వం కరవైంది. సరిత రాకతో కాంగ్రెస్ కు ఇక్కడ కొంత బలం చేకూరనున్నది.