నడ్డాకు సభకు ఈటెల, రాజగోపాల్ రెడ్డి డుమ్మా
1 min readతెలంగాణ బీజేపీలో అసమ్మతి ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. నాగర్ కర్నూల్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బహిరంగ సభకు పలువురు ముఖ్యనేతలు హాజరు కాలేదు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోెపాల్ రెడ్డి సభలో కనిపించలేదు. పార్టీ నాయకత్వంపైన అసంత్రుప్తిగా ఉన్న వీరిద్దరిని అమిత్ షా ఢిల్లీకి పిలిపించి మట్లాడారు. తెలంగాణ బీజేపీ పనితీరుపైన వీరు పలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ప్రధానంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వైఖరీపైన అమిత్ షా ముందు కంప్లైయిట్ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న భావన తెలంగాణ ప్రజల్లోకి వెళ్లిపోయిందని వారు పార్టీ నాయకత్వానికి స్పష్టం చేశారు. అయితే అమిత్ షా , జెపి నడ్డాల నుంచి వీరిద్దరికి స్పష్టమైన హామీ ఏదీ రాలేదని తెలుస్తోంది. దీంతో వీరు జెపి నడ్డా నాగర్ కర్నూల్ సభకు దూరంగా ఉన్నారు. వీరి వర్గానికి చెందిన నాయకులు కూడా సభలో పాల్గొనలేదు.