నల్గొండలోకి భట్టి పాదయాత్ర
1 min read
సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. అచ్చంపేట నుంచి దేవరకొండ నియోజకవర్గంలోకి భట్టి అడుగుపెట్టారు. నల్గొండ నేతలు పలువురు ఆయనకు స్వాగతం పలికారు. పీసీసీ మాజీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి పాదయాత్రలో పాల్గొన్నారు. మరో వైపు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రకు వస్తారా లేదా అన్న దానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే సమయంలో భట్టి పాదయాత్ర సందర్భంగా నల్గొండలో భారీ బహిరంగసభ నిర్వహిస్తానని కోమటిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు.