ఇదే పసుపు బోర్డు.. ఎంపి అర్వింద్ పైన సెటైర్లు

1 min read

నిజామాబాద్ బీజేపీ ఎంపి ధర్మపురి అర్వింద్ పైన బీఆర్ఎస్ ఎదురుదాడిని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఆయనపైన నిజామాబాద్ లో హోర్డింగ్స్ వెలిశాయి. మా ఎంపిగారు తెచ్చిన పసుపు బోర్డు ఇదేనంటు నగరవ్యాప్తంగా బోర్డులను ఏర్పాటు చేశారు. వ్యంగ్యంగా ఉన్న ఈ హోర్డింగ్స్ ను నిజామాబాద్ జనం ఆసక్తిగా చూస్తున్నారు. గెలిచిన తర్వాత ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని అర్వింద్ ఒక బాండు పేపర్ రాసిచ్చారు. అయితే ఆయన ఇప్పటి వరకు పసుపు బోర్డు తీసుకురాలేదని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో అనేక సార్లు అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల యుద్దం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్వింద్ ను ఓడించి తీరుతానని కవిత శపథం చేశారు. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు పైన బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. తాజాగా నిజామాబాద్ లో బోర్డులు ఏర్పాటు చేసి అర్వింద్ ను మరింత టార్గెట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn