మాజీ పిసిసి చీఫ్ డిఎస్ కు తీవ్ర అనారోగ్యం
1 min readపీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో డిఎస్ చికిత్స పొందుతున్న విషయాన్ని ఆయన కుమారుడు ఎం.పి ధర్మపురి అర్వింద్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. డి శ్రీనివాస్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డి శ్రీనివాస్ ఆ తర్వాత టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తో విభేదించి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సోనియాగాంధీని కలిసి తన ఆలోచనను తెలియజేశారు. అయితే ఆయన చేరికను నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో వాయిదా పడతూ వస్తోంది. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నిస్తున్నారు.