ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియులపైన వివాదం
1 min readకంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియుల్లో వివాదం నెలకొన్నది. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించకపోవడం చర్చకు దారి తీసింది. పదవిలో ఉండి చనిపోయిన సాయన్న అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయకపోవడంపైన స్మశానంలో అభిమానులు, అనుచరులు ఆందోళనకు దిగారు. దళిత నేత సాయన్నను సిఎం కేసీఆర్ అవమానించారంటు ధ్వజమెత్తారు. అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియులు నిర్వహించాలని పట్టుపట్టారు. దీంతో వారికి నచ్చచెప్పడానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రయత్నించారు. అయితే సన్మాశనంలో నిరసన కొనసాగించడంతో మంత్రులు వెళ్లిపోయారు. సిఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరకు అధికారిక లాంఛనాలు లేకుండా అంత్యక్రియులను ముగించారు. కంటోన్మెంట్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సాయన్న అనారోగ్యంతో చనిపోయారు.