గన్నవరం టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టిన ఎమ్మెల్యే వంశీ వర్గీయులు
1 min readగన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి ఎమ్మెల్యే వంశీ వర్గీయులు నిప్పు పెట్టారు. కార్యాలయంలోని సామాగ్రిని తగలబెట్టారు. ఆఫీసు ఆవరణలో ఉన్న కారును కూడా దుండగులు దగ్దం చేశారు. వంశీ చర్యకు నిరసనగా గన్నవరంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గన్నవరంలో పోటీపైన వంశీ ఇటీవల చంద్రబాబు,నారా లోకేష్ పైన తీవ్రవిమర్శలు గుప్పించారు. దీనిపైన స్థానిక టీడీపీ నేతలు ప్రతి విమర్శలు చేశారు. దీనిపైన ఆగ్రహంగా ఉన్న వంశీవర్గీయులు తెలుగుదేశం ఆఫీసుపైన దాడికి దిగారు. గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి వంశీ,టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.