రేవంత్ రెడ్డి పైన సీనియర్ల ఆరోపణల్లో నిజమెంత..?
1 min read తెలంగాణ కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నాయకులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన తిరుగుబాటు ప్రకటించారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. పార్టీ కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చిన వారికి పెద్ద పీఠ వేశారని, కాంగ్రెస్ లో పుట్టిన పెరిగిన వారికి అన్యాయం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి,మాజీ ఎంపి మధు యాష్కీ, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తదితరులు రేవంత్ రెడ్డి వైఖరీపైన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పీసీసీ కార్యవర్గంలో యాభై శాతానికి పైగా తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులున్నారని వారు ఆరోపించారు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి వర్గం తోసిపుచ్చింది. కమిటీల్లో కాంగ్రెస్ లో పుట్టిన పెరిగిన వారే తొంభై శాతం మంది ఉన్నారని జాబితాను విడుదల చేశారు.
1, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో 22 మంది సభ్యులు గాను ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే టిడిపి.
2, 40 మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ కార్యవర్గంలో టిడిపి నుంచి వచ్చినవారు..ధనసరి సీతక్క..వేం నరేందర్ రెడ్డి..
3, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు 24 మందికి గాను అయిదుగురు మాత్రమే టిడిపి వారు.. అందులో దొమ్మాటి సాంబయ్య..ఎర్ర శేఖర్.. విజయ రమణారావు..పొట్ల నాగేశ్వరరావు.. తోటకూర జంగయ్య యాదవ్.
4, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 26 మంది డిసిసి అధ్యక్షులను ప్రకటించగా అందులో 7 గురు కొత్తవారికి అవకాశం ఇవ్వగా వారు కూడ కాంగ్రెస్ వారే తప్ప టిడిపి వారు లేరు..
5, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 84 మందిని ప్రకటిస్తే టిడిపి నుంచి వచ్చిన వారికి 6 గురికి అవకాశం కల్పించడం జరిగింది.. అందులో పటేల్ రమేష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, చారకొండ వెంకటేష్.. చిలుక మధుసూదన్ రెడ్డి.. సత్తు మల్లేష్..శశికళ యాదవ్..
*మొత్తం ఇప్పటివరకు ప్రకటించిన కార్యవర్గంలో కేవలం 14 మందికి మాత్రమే టిడిపి నుండి వచ్చిన వారికి పనిచేసే సమర్థులకు అవకాశం కల్పించడం జరిగింది*
టీపీసీసి రాష్ట్ర కార్యవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ వారికి 68 శాతం పదవులు ఇవ్వగా ఓసీలకు ఇవ్వడం జరిగింది..పూర్తిస్థాయి సామాజిక న్యాయం కి అవకాశం ఇవ్వడం జరిగిందని రేవంత్ రెడ్డి వర్గం స్పష్టం చేస్తోంది.
https://youtube.com/live/HbR4OazY8JI?feature=share