సీబీఐ నోటీసులు… కేసీఆర్ తో కవిత భేటీ
1 min readఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కాంలో ఆమె పాత్రపైన వివరణ తీసుకోనున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ కోసం హైదరాబాద్ లోని తన ఇంటికి రావాలని కవిత సీబీఐ అధికారులకు సూచించారు .మరో వైపు సీబీఐ నోటీసుల నేపథ్యంలో సిఎం కేసీఆర్ తో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. ఇదే సమయంలో ఆమె ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవితకు సంఘీభావం తెలపడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమె ఇంటికి వస్తున్నారు.