టీఆర్ఎస్ కు కర్నె ప్రభాకర్ షాక్..?
1 min readమునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు పెద్ద షాకే తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడానికి సిద్దమయ్యారు. గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యక్తిగతంగా అవమానించినందుకే టీఆర్ఎస్ ను వదిలినట్లు నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా తనను అవమానించారని ఆయన చెప్పుకొచ్చారు. మరో వైపు మునుగోడుకు చెందిన మరో ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా టీఆర్ఎస్ కు గుడై బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా పార్టీ అధినేత కేసీఆర్ వైఖరీ పట్ల ఆయన అసంత్రుప్తిగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి గడువు ముగిసిన తర్వాత ఎలాంటి పోస్ట్ ఇవ్వకపోవడంతో ప్రభాకర్ గుర్రుగా ఉన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయనను పలిచి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటికే బీజేపీతో టచ్ లోకి వెళ్లిన కర్నె ప్రభాకర్ తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా కర్నె ప్రభాకర్ ఎవరికి అందుబాటులోకి లేకుండా వెళ్లడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.