ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఆ పార్టీలో అంత క్రియాశీలకంగా పనిచేయడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి రాజకీయాలకు అంటీముట్టనట్లు ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తులపైన అనేక ఉహాగానాలు వచ్చాయి. కాంగ్రెస్ లో కీలక పదవి ఇస్తారని, తెలుగుదేశంలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీ వైపు చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వడానికి ఆ పార్టీ అంగీకరించిందని సమాచారం. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే తెలంగాణపైన ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారని చెపుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కోసం పని చేస్తారని తెలుస్తోంది.