కార్మికుడి కుటుంబానికి కోటీ రూపాయల ప్రమాద బీమా
1 min read
రాష్ట్ర చరిత్రలోనే ఒక కార్మికుడి కుటుంబానికి ప్రమాద బీమా కింద కోటీ రూపాయలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వయంగా చెక్ తో పాటు నియామక ఉత్తర్వులను అందజేశారు. NPDCL విధులు నిర్వహిస్తున్న జోగు నరేష్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల విద్యుత్ సంస్థ తమ కార్మికుల కోసం కోటీ రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పించింది. ఇందులో భాగంగా నరేష్ కుటుంబానికి రూ.1 కోటి ప్రమాద బీమా చెక్కును, అతని భార్య శ్రీమతి రమేష్‌కు విద్యుత్ శాఖలో కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేశారు. సింగరేణిలో ప్రారంభించిన ఈ పథకాన్ని విద్యుత్ సంస్థలకూ విస్తరించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.