కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే తీగెల క్రిష్ణారెడ్డి
1 min read
అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనున్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయన కోడలైన రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ తీగల అనిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరిద్దరు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రేతో సమావేశమయ్యారు. రెండు రోజుల్లో తీగల తన కోడలుతో కలిసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరనున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

తీగల క్రిష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే సబితా బీఆర్ఎస్ లోకి జంప్ చేసి మంత్రి అయ్యారు. దీంతో తీగల క్రిష్ణారెడ్డి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పార్టీ నాయకత్వం ఆయనను పట్టించుకోవడం మానేసింది. ఫలితంగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని తీగల నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం కాంగ్రెస్ టిక్కెట్ ను తీగల ఆశిస్తున్నారు. గతంలో హైదరాబాద్ మేయర్ కూడా ఆయన పనిచేశారు. మంత్రి మల్లారెడ్డికి తీగల క్రిష్ణారెడ్డి అత్యంత సన్నిహిత బంధువు.