ఆర్ట్స్ కాలేజీ ముందు సీఎం రేవంత్ రెడ్డి సభ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ నిర్వహించారు. యూనివర్సిటీ అభివ్రుద్ది కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన ప్రకటించారు. ఉస్మానియా లో అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని ఆయన
అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే ఎందుకంత ధైర్యం చేస్తున్నావని నన్ను కొంతమంది అడిగారని ముఖ్యమంత్రి అన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కావాల్సింది ధైర్యం కాదు.. అభిమానమని సీఎం స్పష్టం చేశారు.
గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని యూనివర్సిటీకి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చానని ఆయన
అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉందన్నారు.
ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతీసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైందన్నారు.
కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యంపై పోరాటం కొనసాగిందని
ఆయన అన్నారు. పీవీ నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

