*ఎస్.. ఈ దేశం కోసం ప్రధాని అవుతా..*

*ఎస్.. ఈ దేశం కోసం ప్రధాని అవుతా..*

మొదటి సారి ప్రధాన మంత్రి పదవి గురించి సానుకూల సంకేతాలు ఇచ్చిన రాహుల్ గాంధీ..

తెలంగాణ లో జరిగిన డీసీసీ అధ్యక్షులు శిక్షణ శిబిరంలో ముగింపు సమావేశంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్..

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభ్యర్థనపై రాహుల్ గాంధీ సానుకూల స్పందన..*

*ఈ దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందేనని కోరిన రేవంత్ రెడ్డి..*

అందుకు స్పందించిన రాహుల్ గాంధీ మోడీ పై యుద్ధానికి సిద్ధం అంటూ ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి అంగీకారం తెలిపిన రాహుల్ గాంధీ..

*డీసీసీ ల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.*.

ఈ దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాల్సిందే.

రాహుల్ జి కుటుంబం లో తాత, నానమ్మ, తండ్రి ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి రాహుల్ గాంధీ గారికి ప్రధాన మంత్రి పదవి వ్యామోహము లేదు.

రాహుల్ జి అత్యంత సాధారణ వ్యక్తిలా అందరిలో కలిసిపోతు రాజకీయాలు చేస్తున్నారు.

కానీ నేడు దేశం ఉన్న పరిస్థితులలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా అయ్యేలా ప్రతి ఒక్కరు కష్టపడాలి.

నేను సీఎం గా అడగడం లేదు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా కోరుకుంటున్న..

రాహుల్ గాంధీ ప్రధాని పదవి కోసం కృషి చేయాలి, దేశం కోసం ఆ బాధ్యత తీసుకోవాలి.

రాహుల్ గాంధీ కి ప్రధానమంత్రి పదవి అలంకరణ కాదు ఈ దేశ ప్రజలకు సేవ చేయడం కోసమే..

ఆ దిశగా రాహుల్ గాంధీ సంసిద్ధత వ్యక్తం చేయాలి.. ఇది దేశ ప్రజల, కాంగ్రెస్ కార్యకర్తల బలమైన కోరిక..

సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని విన్న రాహుల్ గాంధీ నవ్వుతూ అందుకు సన్నద్ధం అన్నట్టుగా తల ఊపారు…

ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn