సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా
1 min read
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న సచివాలయాన్ని ఘనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల, రాజకీయ పార్టీల నేతలను కూడా సిఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా పేరేడ్ గ్రౌండ్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. సెక్రటేరియట్ ప్రారంభానికి అనుమతి ఇవ్వాలని ఈసీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కోరారు. అయితే ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెక్రటేరియర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత సచివాలయ ప్రారంభోత్సవంపైన నిర్ణయం తీసుకోనున్నారు.