భీమ్లానాయక్ వాయిదా

1 min read

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విడుదల వాయిదా పడింది. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా శివరాత్రికి విడుదల కానున్నది. జనవరిలో రెండు భారీ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ మార్పు జరిగింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ విజ్జప్తి మేరకు పవన్ కళ్యాణ్ తన సినిమా విడుదల వాయిదాకు అంగీకరించారు. సంక్రాంతికి రాజమౌళి RRR సినిమాతో ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ అవుతున్నాయి. దీంతో థియేటర్ల కొరత ఏర్పడే అవకాశముందని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చెపుతోంది. అందుకే దిల్ రాజు తో పాటు పలువురు నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను కలిసి భీమ్లానాయక్ సినిమా విడుదల వాయిదా వేయాలని కోరారు. భీమ్లానాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ కానున్నది. అయితే ఈ నిర్ణయంపైన పవన్ కళ్యాణ్ అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn