రేవంత్ రెడ్డికి మద్దతు పలికిన కవిత
1 min read
పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన వివాదంపైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. నిర్మలా సీతారామన్ వీక్ హీందీపైన కాకుండా వీక్ రూపీ మీద స్పందిస్తే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు. భాష పైన మీద కాక ప్రజా సమస్యలపైన బీజేపీ నేతలు ద్రుష్టి సారించాలన్నారు. తెలంగాణకు నిధులు రాకుండా నిర్మాలా సీతారామన్ అడ్డుకుంటున్నారని కవిత విమర్శించారు. బండి సంజయ్ తన పైన చేసిన విమర్శలు బాధించాయని ఆమె అన్నారు. మోదీ నుంచి బండి సంజయ్ వరకు మహిళలపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లకు కళ్లుమూసీనా తెరిచినా కేసీఆరే కనిపిస్తున్నారని ఆమె అన్నారు. వైఎస్ షర్మిలను షర్మిలా పాల్ అని పిలుస్తున్నారని కవిత వ్యంగ్యబాణాలు విసిరారు. నిజామాబాద్ ఎంపి అర్వింద్ ఎక్కడా పోటీ చేసినా ప్రచారం చేసి ఓడిస్తానని అమె స్పష్టం చేశారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు.