కాంగ్రెస్ లో కోవర్టులున్నారు.. దామోదర రాజనర్సింహా
1 min read
కాంగ్రెస్ లో కోవర్టులకే పదవులు దక్కుతున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ఆరోపించారు. కష్టపడి పనిచేస్తున్న వారిని పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. పీసీసీ కమిటీల ఏర్పాటుపైన దామోదర రాజనర్సింహా అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన నాయకుల పనితీరును అధిష్టానం అంచనా వేయడంలో విఫలమైందన్నారు. హైకమాండ్ ను గౌరవిస్తామన్న దామోదర రాజనర్సింహా ఆత్మగౌరవానికి మించింది ప్రపంచంలో ఏదీ లేదని వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు కోవర్ట్ లను బయటపెడతామని ఆయన స్పష్టం చేవారు. వారి వల్లనే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని రాజనర్సింహా అన్నారు. పార్టీలో పూర్తి ప్రక్షాళన జరగాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ను కాపాడుకోవాలన్న ఆరాటంతోనే తాను మాట్లాడుతానని రాజనర్సింహా అన్నారు. ఎన్నికలకు ఒక యేడాది మాత్రమే సమయముందన్న ఆయన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో వైపు దామోదర రాజనర్సింహా అసంత్రుప్తిని పార్టీ అధిష్టానం ద్రుష్టికి తీసుకెళ్తామని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి.