దాక్షాయణిగా యాంకర్ అనసూయ

1 min read

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాపైన భారీ అంచనాలున్నాయి. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు,పాటలు,ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల సునీల్ క్యారెక్టర్ ఫోటోను రిలీజ్ చేసి దర్శకుడు సుకుమార్ అందరిని ఆశ్చర్యపర్చాడు. కెమెడియన్, హీరోగా సుపరిచితుడైన సునీల్ పుష్పలో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు ఆయన సంకేతాలిచ్చాడు. భయంకరమైన రూపంతో ఉన్న సునీల్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదే స్థాయిలో అశ్చర్యపరుస్తు సుకుమార్ మరో క్యారెక్టర్ నటి, యాంకర్ అనసూయ ఫోటోను విడుదల చేశారు. నోట్లో కిల్లీతో ఉన్న అనసూయ పుష్పలో  దాక్షాయణి పాత్ర పోషిస్తుందట. డిసెంబర్ 17న పుష్ప మొదటి భాగం ఐదు భాషల్లో విడుదల కానున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn