బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్
1 min read
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కొంత ఊరట లభించింది. ఆయనను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించింది. బండి సంజయ్ ను ఏదో ఒక రాష్ట్రానికి ఇంఛార్జ్ కు పంపించే అవకాశముంది. ఇటీవలె తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండిని నాయకత్వం తొలగించింది. దీనిపైన ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పలువురు బీజేపీ నాయకులు కూడా బండిని తొలగించిన తీరుపైన ఆవేదన చెందారు. దీంతో సంజయ్ ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన అవకాశం కల్పించారు.