సోనుసూద్.. రియల్ హీరో

తన మానవత్వంతో దేశంలో హీరోగా నిల్చిన ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ మరో సారి తన గొప్ప మనసును నిరూపించుకున్నారు.వేలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు పంపించిన సోనూ తాజా ఓ రైతును ఆదుకున్నారు. ట్వీట్టర్ లో వచ్చిన చిన్న వార్తకు స్పందించిన ఆయన ఒక్క రోజులో అతని కష్టాన్ని తీర్చారు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్ రాజపురం రైతు నాగేశ్వరరావు కు సంబంధించిన వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. టమోటో సాగు చేసే నాగేశ్వరరావు కరోనా దెబ్బకు కుదలేలయ్యారు. పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర నష్టాల పాలయ్యాడు. దీంతో మళ్ళీ సీజన్ ప్రారంభించడానికి ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. తన పొలంలో టమోటో విత్తనాలు వేయడానికి ఇద్దరు కూతుర్లను కాడెడ్లుగా మార్చారు. వీరి కష్టాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ కథనాన్ని చూసిన సోనుసూద్ వారిని అదుకుంటానని వెంటనే ట్విట్ చేశారు. ఈ కుటుంబానికి ఎద్దుల జతను అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ ఆడపిల్లలు చదువుకోవాల్సిన అవసరం ఉందని సోను అన్నారు. అయితే వెంటనే తన మనసు మార్చుకొని వారికి ట్రాక్టర్ కొనిస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం సాయంత్రానికి ఆ రైతు ఇంటికి ట్రాక్టర్ చేరుకుంది. సోనాలిక ట్రాక్టర్ డీలర్ తో మాట్లాడి ఆయన ఈ ఏర్పాటు చేశారు. దీంతో రైతు నాగేశ్వరరావు కుటుంబం సంతోషంగా ఉప్పొంగిపోయింది. సోనుసూద్ కు దేశవ్యాప్తంగా మరో సారి అభినందనల వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రాజకీయ నాయకులు, బడా వ్యాపారస్తులు, సినిమా తారలు ఉన్నప్పటికి రైతు కష్టంపైన ఒక్కరు కూడా స్పందించలేదు. దీనిపైన నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!