ఓ ఎద్దు ..లవ్ స్టోరీ

ఓ ఎద్దు తమిళనాడులో హాట్ టాఫిక్ గా మారింది. తన సహచర ఆవుపైన ఈ ఎద్దు చూపించిన ప్రేమ అక్కడి జనాన్ని కట్టిపడేసింది. ఏకంగా ప్రభుత్వ పెద్దలనే కదిలించింది. ఫలితంగా ఆ ఎద్దు, ఆవు మళ్లీ ఒకటయ్యాయి. తమిళనాడులోని మధురై జిల్లాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాలమేడుకు చెందిన మునీంద్రరాజాకు ఒక ఎద్దు, ఒక ఆవు ఉన్నాయి. అయితే ఆప్పుల బాధతో మునీంద్ర తనకు ఉన్న ఆవు లక్ష్మీని అమ్మాడు. ఆవును కొనుక్కున్న వాళ్లు ట్రాలీ ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. అయితే ఆవును పట్టుకుపోవడాన్ని ఎద్దు తట్టుకోలేకపోయింది. దీంతో ఆ ఎద్దు లక్ష్మీని తీసుకెళ్తున్న ఆటో వెనకాలా దాదాపు కిలోమీటరు దూరం పరుగెత్తింది. ఆటోకు అడ్డంగా నిలబడింది. డ్రైవర్ దగ్గరకు వెళ్లి బతిమాలుతున్నట్లుగా అరిచింది. ఆటోలో ఉన్న లక్ష్మీ చుట్టు తిరుగుతు తన బాధను వ్యక్తం చేసింది. ఈ ద్రుశ్యాలన్నింటిని స్థానికులు వీడియో తీశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు తమిళనాడులో విస్రుతంగా ప్రచారం అయ్యాయి. తమిళనాడు డిప్యూటీ సి.ఎం పన్నీరు సెల్వం కుమారుడు జయప్రదీప్ దీనిపైన స్పందించాడు. ఆవును కొన్న వాళ్లకు ఆయన స్వయంగా డబ్బులు ఇచ్చి తిరిగి ఎద్దు వద్దకు చేర్చాడు. దీంతో మళ్ళీ పాత యాజమాని ఇంట్లో ఎద్దు,ఆవు ఒక్కటయ్యాయి. దీంతో నెటిజన్లు, జంతుప్రియులు సంతోషపడుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!