తండ్రైన అంబటి రాయుడు

భారత క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యాడు. ఆయన భార్య విద్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తాను తండ్రైన విషయాన్ని అంబటి రాయుడు ట్విట్టర్ లో పోస్టు చేశారు. రాయుడుకి 2009లో వివాహం అయింది. విద్యను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పదకొండేళ్ల తర్వాత అంబటి దంపతులకు బిడ్డ కల్గడం విశేషం. అంబటి రాయుడుకు సోషల్ మీడియా ద్వారా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు క్రికెటర్లు కూడా అంబటికి కాంగ్రాట్స్ తెలిపారు. అంబటి రాయుడు భారత్ తరుపున 55 వన్డేలు ఆడాడు.6 టీ29 మ్యాచ్ లు కూడా ఆడిన రాయుడు గత యేడాది క్రికెట్ కు గుడ్ బై చెపుతున్నట్లు ప్రకటించాడు. ప్రపంచ కప్ జట్టుకు తాను ఎంపిక కాకపోవడంతో తీవ్ర ఆగ్రహనికి గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అంబటి రాయుడు ఐపిఎల్ లో చైన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు.


Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!