తెలంగాణను కాపాడు సోనియమ్మ..

సమస్యలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజల తరుపున ప్రధాని మోదీ కి లేఖ రాయాలని ఎం.పి కోమటిరెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కోరారు. మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆయన సోనియాకు వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కోమటిరెడ్డి వీడియో కాల్ లో మాట్లాడారు. తెలంగాణలోని పరిణామాలను ఆమెకు వివరించారు. విద్యార్థుల ఆత్మబలిదానాలను చూడలేక తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఇచ్చారని కోమటిరెడ్డి సోనియాతో అన్నారు. నాలుగు కోట్ల ప్రజల చిరకాల కోరికను నిజం చేశారని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనతో రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని కోమటిరెడ్డి అధినేత్రి సోనియాకు తెలిపారు. కరోనా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని ఆయన వివరించారు. కరోనా టెస్టులు చేయడం లేదని, కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని సోనియాకు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా మీరే తెలంగాణను కాపాడాలని ఆమెను కోరారు. ఆయురారోగ్యాలు కలిగిఉండాలని కోరుకుంటున్నట్లు సోనియాతో కోమటిరెడ్డి అన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!