కాాంగ్రెస్ కార్యకర్తగా అండగా రేవంత్

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముందు నిలబడి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబాకు ఎం.పి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఆయన అరెస్టు చేసి వదలకుండా నిర్భదించడం పైన పోలీసులతో మాట్లాడారు. చిన్న పాటి నిరసనకే అరెస్టు చేయడమేమిటని రేవంత్ రెడ్డి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ను ప్రశ్నించారు. ఒక వేళ కేసు పెడితే ఫైల్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలని ఆయన స్పష్టం చేశారు. కేసును పరిశీలించిన తర్వాత వదిలేస్తామని కమిషనర్ రేవంత్ రెడ్డి కి సమాధానం ఇచ్చారు. అంతకు ముందు స్థానిక ఎసీపీకి ఫోన్ చేసినా స్పందించలేదు. తాను లీవ్ లో ఉన్నాని సిఐ పక్కకు తప్పుకున్నారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ తో రేవంత్ రెడ్డి మాట్లాడాల్సి వచ్చింది.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గత పది రోజులుగా కనిపించకపోవడంపైన సోషల్ మీడియాలో వేర్ హిజ్ కేసీఆర్ అన్న ట్యాగ్ లైన్ తో క్యాంపైయిన్ నడుస్తోంది. కేసీఆర్ ఆచూకీ చెప్పాలంటు పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయన క్షేమం కోరి కొందరు గుళ్లలో పూజలు చేస్తున్నారు కూడా. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబా సి.ఎం క్యాంప్ కార్యాలయం ముందు ప్లకార్డు ప్రదర్శించారు. వేర్ ఈజ్ కేసీఆర్, ఇ ఈజ్ మై సిఎం అని నినాదాలు చేశాడు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది సాయిబాబాను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయనను వదిలిపెట్టకుండా గంటల తరబడి స్టేషన్ లో ఉంచారు. దీనిపైన రేవంత్ రెడ్డి స్పందించి కమిషనర్ తో మాట్లాడారు. క్యాంపు ఆఫీసు ముందు చిన్న ప్లకార్డు ప్రదర్శించినందుకు పోలీసులు కేసులు పెట్టడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!