కేసీఆర్ ఎక్కడ…?

కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వాసుల్లో ఆందోళన పెరుగుతోంది. పాజిటివ్ సంఖ్య రెండువేల మార్క్ కు దగ్గరవుతుండటం సామాన్యులను వణికిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులు కరోనా దెబ్బకు హడలెత్తిపోతున్నారు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతి చోట కేసులు బయటపడుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. చివరకు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో కూడా 20కి పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో మరో సారి లాక్ డౌైన్ ఖాయమన్న ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కూడా ఇలాంటి సంకేతాలే వచ్చాయి. మంత్రులు కూడా లాక్ డౌన్ ఖాయమన్న రీతిలో మాట్లాడారు. దీంతో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు జనం తరలివెళ్తున్నారు. కాని రోజులు గడుస్తున్నప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. లాక్ డౌన్ ఉండకపోవచ్చుననే అభిప్రాయం నెలకొన్నది. ఇదే సమయంలో అసలు కేసీఆర్ ఎక్కడున్నాడన్న చర్చ మొదలైంది. ప్రగతి భవన్ లో పాజిటివ్ కేసుల నేపథ్యంలో చంద్రశేఖర్ రావు పరిస్థితి ఏమిటన్న దానిపైన ఆసక్తి నెలకొన్నది. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఎక్కడ అన్న పదం ఇప్పుడు ట్రెండింగ్ మారింది. వేల కేసులు నమోదు అవుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదంటు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సమీక్షా సమావేశాలు నిర్వహించకపోవడాన్ని వారు ఎత్తి చూపిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడి జరుగుతుండటం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సరిగా అందకపోవడంపైన కేసీఆర్ మాట్లాడకపోవడంపైన నెటిజన్లు దుమ్మెత్తిపోతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గత కొన్ని రోజులుగా ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. అక్కడి నుంచి వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ప్రగతి భవన్ లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆయన ఫామ్ హౌజ్ సేఫ్ అని భావిస్తున్నారు. మరికొన్ని రోజులు కేసీఆర్ అక్కడే ఉండే ఛాన్స్ ఉంది. అయితే కరోనాతో హైదరాబాద్ అల్లాడుతుంటే ముఖ్యమంత్రి ఇక్కడ ఉండకుండా ఫామ్ హౌజ్ కు వెళ్లడంపైన కూడా విమర్శలొస్తున్నాయి. జనాన్ని గాలికి వదిలేశారంటు ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మొదటి విడత లాక్ డౌన్ సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారానికోసారి ప్రెస్ మీట్ పెట్టి పరిస్థితిని వివరించేవారు. ప్రజలకు ధైర్యం చెప్పే వారు. దీంతో ఆయన మీడియా సమావేశాల కోసంజనం ఎదురు చూసేవారు. కాని ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. కేసులు సంఖ్య బాగా పెరుగుతు న్న సమయంలో చంద్రశేఖర్ రావు కనిపించకుండా పోయారు. దీంతో తెలంగాణ ప్రజలు అభద్రతా భావనలో ఉన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!