పేకాట ఆడుతు దొరికిన ఎమ్మెల్యే సోదరుడు

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరో సారి వివాదంలో ఇరుక్కున్నారు. వరంగల్ లోని విద్యారణ్యపురిలో ఆయన సోదరుడు పేకాట ఆడుతు పోలీసులకు చిక్కారు. స్వయంగా తన నివాసంలోనే పేకాట శిబిరం నిర్వహిస్తు గండ్ర భూపాల్ రెడ్డి దొరికిపోవడం విశేషం. అయనతో పాటు మరికొందరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లక్షల 78వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. బాలసముద్రం కి చెందిన చకిలం వేణుగోపాల్, పోచమ్మ మైదానం కి చెందిన బంగారు దుకాణం యజమాని బజ్జూరు విక్కీ,100 ఫీట్ల రోడ్డు కు చెందిన గండ్ర సుధాకర్ రెడ్డి , హంటర్ రోడ్డు నివాసి సెంక్య నరసింహారెడ్డి ,మట్టవాడ కు చెందిన అల్లూరి విజయ్ కుమార్,విద్యారణ్యపురి వాసి పెరల కనకయ్య లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపైన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించాల్సి ఉంది. భూపాల పల్లి నుంచి కాంగ్రెస్ తరుపున విజయం సాధించిన గండ్ర ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.


Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!