చీరలు జాగ్రత్తలు…

చీరలు కొనేటప్పుడే వాటిని ఉతికడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అడిగి తెలుసుకోవాలి. డ్రైక్లీన్‌ మాత్రమే అని రాసి ఉండే చీరల్ని డ్రైక్లీనింగ్‌ ఇవ్వడం తప్పనిసరి. వాటిని వేరేరకంగా శుభ్రం చేస్తే ఈ చీరలు పాడై పోవచ్చు. కొనే ప్రతి చీరకూ కొంగులు, ఫాల్‌ కుట్టించడం మర్చిపోకూడదు. పట్టు చీరల మధ్యలో నాఫ్తాలిన్‌ ఉండలను ఉంచడం మంచిది కాదు. వేరే రకమైన చిట్కాలను పాటించడం మేలు. గంధం పొడి లేదా పలుచని వస్త్రంలో మూటకట్టిన ఎండు వేపాకును ఉంచవచ్చు. చీరలను చల్లని, పొడి ప్రదేశంలో భద్రపరచాలి. అన్నిరకాల చీరలను వార్డ్‌రోబ్‌లో అలాగే సర్దేయవద్దు. నిత్యం కట్టుకునే చీరలను హ్యాంగర్లకు తగిలించుకోవాలి. చీరలపై మరకలు పడితే వెంటనే నీటితో కడిగేయాలి. అదే నూనె మరకైతే టాల్కమ్‌ పౌడర్‌ను దానిపైన చల్లాలి . పౌడర్‌ జిడ్డును పీల్చేస్తుంది. ఆ తరువాత డ్రైక్లీనింగ్‌కు ఇవ్వాలి.

చీరలను ఇస్త్రీ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని రకాల చీరల్ని డైరెక్ట్ గా ఇస్త్రీ పెట్టెతో రుద్దేయకూడదు. ఆయా చీరల ఫ్యాబ్రిక్‌ను బట్టి ఐరన్‌ బాక్స్‌లో హీట్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసుకోవాలి. నాజూగ్గా ఉండే సిల్క్‌, ఎంబ్రాయిడరీ చీరలకు మధ్యలో వేరే కాటన్‌ వస్త్రం ఉంచి ఇస్త్రీ చేయాలి. మూడు నెలలకొకసారి చీరలను కాసేపు గాలి వచ్చే చోట ఆరేయాలి. ఆ తరువాత మడతపెట్టాలి. మడతల్లో చిరగకుండా ఉండాలంటే మార్చి మార్చి మడతేయడం, చుట్టడం మంచిది. ఎంబ్రాయిడరీ చీరల్ని, పట్టు చీరల్ని హ్యాంగర్లకు వేలాడదీయకూడదు. వీటిని విడివిడిగా మృదువెైన కాటన్‌, ముఖుమల్‌ వస్త్రంలో చుట్టిపెట్టడం మంచిది. హెవీ సిల్క్‌, జరీ వర్క్‌ చేసిన చీరలను విడివిడిగా భద్రపరచాలి. ఒకే వరుసలో ఉంచితే ఒక చీర దారాలు మరోచీరకు పట్టుకొని పాడెైపోతాయి.

పట్టుచీరలపైన నూనె మరకలు పడుతుంటాయి.వంట చేసేటప్పుడు లేదా పూజల సమయంలో నూనె పడటం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈ నూనె మరకలను పొగొట్టడానికి కొన్ని చిట్కాలను పాటించాలి. నూనె పడిన చోట బేకింగ్ సోడా లేదా కార్న్ స్టార్చ్ పొడిని వేయాలి. రెండు గంటల పాటు కదపకుండా అలాగే ఉంచాలి.తర్వాత దాన్ని బ్రష్ లేదా తెల్లటి బట్టతో తీసేయాలి. ఒక వేళ మరక పూర్తిగా పోకపోతే మరో సారి అలాగే చేయండి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!