సీతక్క సేవలకు కొండా ఫిదా

కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క విసిరిన ‘గో హంగర్ గో’ సవాలును చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వీకరించారు. సీతక్క లాంటి శక్తిమంతమైన సామాజిక కార్యకర్త, నాయకురాలని ఆయన వ్యాఖ్యానించారు.ఆమె కష్టపడే తత్వం, సాహసం సాటిలేనివని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ‘గో హంగర్ గో’ ఛాలెంజ్‌ను స్వీకరించిన కొండా విశ్వశ్వర్ రెడ్డికి సీతక్క కృతజ్ఞతలు చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిరాడంబరత ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని ట్వీట్ చేశారు. తన ఛాలెంజ్‌ను విశ్వేశ్వర్ రెడ్డి స్వీకరించడం వల్ల మరింత మంది ‘గో హంగర్ గో’ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారని అలాంటి వారికి అండగా ఉండాలంటూ సీతక్క సోమవారం ‘గో హంగర్ గో’ పిలుపునిచ్చారు. ఈ సవాలును స్వీకరించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ఎంపీ రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, షబ్బీర్ అలీని సోషల్ మీడియాలో తనను అనుసరిస్తున్న వారిని సీతక్క కోరారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!