కేసీఆర్.. మా ప్రాజెక్టులు నిలిపేస్తవా..?

నల్గొండ జిల్లా ప్రాజెక్టుల నిలిపివేతపై ముఖ్యమంత్రి గారికి కోమటిరెడ్డివెంకటరెడ్డి గారు బహిరంగ లేఖ*

నీళ్ళు,నిధులు,నియామకాల కోసం ఆంధ్ర పాలకులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నియంతృత్వ పోకడలతో ఎడారిగా మార్చేస్తున్నారు. శ్రీశైలం సొరంగంమార్గం,బ్రాహ్మణ వెల్లoల ఉదయ సముద్రఎత్తిపోతల పథకం ప్రాజెక్టు,డిండి ప్రాజెక్టులను నిలిపివేసినారు ఇవి ఉమ్మడి నల్లగొండ ప్రజల చిరకాల కోరికలు వాటిని ఎడారిగా మారుస్తున్నారు….

1981 లో టంగుటూరి అంజయ్య గారు SLBC ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేశారు
.పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు జరగలేదు.2005 లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు.2014 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కుర్చి వేసుకుని సొరంగ మార్గంను పూర్తి చేస్తాఅని హామీ ఇచ్చావ్.ఆరు సంవత్సరాల దాటిన అరకిలోమీటరు మేరకు పనులు జరగలేదు.మీరు పనులను చెయ్యదల్చుకున్నారా లేదా? ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 75 శాతం పూర్తిచేసిన ప్రాజెక్టులను అప్పగిస్తే 6సంవత్సరాలలో ఎం చేశావ్.కావాలనే కక్షపూరిత వ్యవహారం చేస్తున్నావ్.బ్రాహ్మణ వెల్లoల ఉదయ సముద్రఎత్తిపోతల పథకం ప్రాజెక్టు లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. నల్గొండ, చిట్యాల, కట్టంగూర్, శాలిగౌ రారం, నార్కట్ పల్లి పలు ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 2016 డిసెంబర్ నెలలోపు పూర్తి చేస్తాము అని మాట ఇచ్చారు.ఈ ప్రాజెక్ట్ కూడా కాంగ్రెస్ హయాంలో 75 శాతం పూర్తి అయింది కేవలం 100 కోట్లు ఇస్తే లక్ష ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెరువులు నిండి భూగర్భజలాలు పెరిగి ప్లోరైడ్ కూడా తగ్గిపోతుంది.ప్రాజెక్టు సంబంధించిన అన్ని పనులు సిద్ధంగా ఉన్నాయి కేవలం 100 కోట్లు విడుదల చేస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది మీరు విడుదల చేస్తారో లేదో? ముఖ్యమంత్రి చెప్పాలి?

 హైదరాబాద్ నుండి వచ్చే మూసి నది భువనగిరి, పోచంపల్లి,నార్కట్ పల్లి,చౌటుప్పల్, చిట్యాల,లో చెరువులను నింపుకోవటానికి 350 కోట్ల రూపాయలు కేటాయించారు.ఆ పనిని ఒక కాంట్రాక్టర్ కి అప్పీగిస్తే దానిని మీ పార్టీ MLA,MP పంచుకొవటంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.డిండి ప్రాజెక్ట్ అని చెప్పి 6000 కోట్లకు టెండర్లు పిలిపించి మీపార్టీ మాజీ ఎంపీకి పనులు అప్పగించారు కానీ ఇప్పటికీ 25 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయి.డిండి ప్రాజెక్ట్ పనులు ఇంకా 15 సంవత్సరాలు అయిన పూర్తి అయ్యే పరిస్థితి లేదు.మునుగోడు ప్లోరైడ్ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్ట్ తో విముక్తి వస్తుంది అయిన పనులలో జాప్యం ఎందుకు  KCR వీటన్నిటి పై వెంటనే స్పష్టమైన సమాధానం చెప్పాలి.3 సంవత్సరాలలోనే ఆఘమేఘాల లో కాళేశ్వరం పనులు పూర్తి చేశారు .3 TMC లకు కొత్తగా మళ్ళీ 22,000 కోట్ల టెండర్లకు పిలిచారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మేము వ్యతిరేకం కాదు కాని నల్లగొండ ప్రజకు ,రైతులు మీకు ఎం పాపం చేశారు.చివరి దశలో ఉన్న ప్రాజెక్టు లను ఎందుకు పూర్తి చేయటం లేదు.కేవలం కాళేశ్వరం ఒక్క ప్రాజెక్ట్ తోనే రాష్ట్రం అభివృద్ధి జరగదు.నల్గొండ ప్రాజెక్ట్ ల పనులలో ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.నల్లగొండ ప్రాంతంలో వెయ్యి ఫీట్ల లోతు బోర్లు వేసినా చుక్క నీరు పడదు.బోర్లు వేసి వేసి ఇంటి పేరు బోర్ల రామిరెడ్డి గా మార్చుకున్నాడని ముషంపల్లి అని చెప్పి ఉద్యమంలో అసెంబ్లీలో వెయ్యి సార్లు చెప్పినవ్. ముఖ్యమంత్రి అయ్యాక ముషంపల్లి ఊరికి వస్తా అనిచెప్పి ఎదుయేండ్లు అయినది…
ఇప్పటికి నల్గొండజిల్లాలో అదే పరిస్థితి..

ప్లోరైడ్ తో బాధ పడుతున్న మా నల్లగొండ ప్రజల బాధలు మీకు కనబటం లేదా..మా నల్గొండ రైతుల గోసలు మీ చెవికెక్కడం లేదా .ఈ ప్రాజెక్ట్ ల నిర్మాణం కోసం కేసీఆర్ ని ఎన్నిసార్లు విన్నపించిన ప్రయోజనం లేకుండా పోయింది.నేను వెంటపడి రైతుల సంక్షేమం కోసం తెచ్చిన ప్రాజెక్టు లు ఇవి పూర్తి అయితే కోమటిరెడ్డి కి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని కేసీఆర్ బయపడుతున్నాడు.మీరు స్వార్థాన్ని విడిచి ప్రాజెక్టు లను పూర్తిచేయండి 75 శాతం కాంగ్రెస్ పార్టీ పనులను పూర్తి చేసిన TRS పార్టీ నే ప్రాజెక్ట్ లను పూర్తి చేసింద అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పుతాం.కాంగ్రెస్ పార్టీ కట్టించిన నాగార్జునసాగర్,శ్రీశైలం ప్రాజెక్టులతో కొన్ని ఎకరాల్లోనే నీళ్లు వస్తున్నా. రెండు మూడు నెలల్లోగా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలి.మాకు రైతుల,ప్రజల సంక్షేమమే ముఖ్యం మేము వారికోసం చావడానికి అయిన సిద్ధం..మీ రాజకీయ లాభం కోసం నల్లగొండ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకండి.తెలంగాణ అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణమే కాదు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండేలా అన్ని ప్రాజెక్టు లను పూర్తి చేసి రైతుని రాజు చేయాలి.తెగించి తెచ్చుకున్న తెలంగాణలో న్యాయం జరగకపోతే తెలంగాణ ఉద్యమాన్ని మించిన రైతు ఉద్యమం చేస్తాo.ఆ ఉద్యమానికి నల్గొండ రైతులే ముందు ఉండి నడిపిస్తారు.కేసీఆర్ నిరంకుశ పాలన ను ఎండకడతాం.నల్లగొండ ప్రజలు,రైతులు ప్రాజెక్టులు పూర్తి కావాలని భగవంతున్ని ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు

మానవత్వం ఉన్న మనిషిలాగా ముఖ్యమంత్రిగా ఆలోచించు.నల్లగొండ ప్రజల పాపం నీకు తగులుతుంది.ప్రజలు తిరగబడే రోజులుకూడా దగ్గరే ఉన్నాయి.రాబోయే కాలంలో దేవుడి ఆగ్రహానికి గురిఅవుతావ్ మా పాపం తప్పదు.పైన దేవుడు ఉన్నాడు దేవుడే శిక్షవిధిస్తాడు…

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!