విలక్షణ నటుడు కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌(53) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఇర్ఫాన్‌ఖాన్‌ అరుదైన క్యాన్సర్‌తో ఆయన బాధపడుతున్నారు.విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఇర్పాన్ ఖాన్ తన క్యాన్సర్ గురించి 2018 మార్చిలో ప్రకటించారు. అయితే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆయన చివరకు క్యాన్సర్ మహమ్మారికి బలయ్యారు. ఆయన తల్లి రెండు రోజుల క్రితమే రాజస్తాన్ లో జయపురలో కన్నుమూశారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇర్ఫాన్ తన తల్లి చివరి చూపునకు నోచుకోలేకపోయాడు. ఇంతలోనే ఆయన కూడా కన్నుమూయడం విషాదకరం. ఇర్ఫాన్ ఖాన్ తో హిందీ, ఇంగ్లీష్ తో పాటు పలు ప్రాంతీయ భాషా సినిమాల్లో కూడా నటించారు. ఇర్ఫాన్ నటించిన స్లమ్ డాగ్ మిలియనీర్ ,లైఫ్ ఆఫ్ పై, అంగ్రేజీ మేడమ్ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో ఇర్ఫాన్ నటించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!