జగన్ నియోజకవర్గంలో అన్నదాత కన్నీళ్లు..

కరోనా మహమ్మారి రైతుల ఉసురు తీస్తోంది. పండించిన పంటకు సరైన ధర లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర నిరుత్సాహనికి గురవుతున్నారు. ప్రభుత్వం ఎన్ని మాటలు చెపుతున్నప్పటికి రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదు.క్షేత్రస్థాయిలో సర్కార్ నిర్ణయాలు అమలు కాకపోవడంతో రైతులకు కన్నీళ్లే మిగిలుతున్నాయి. ప్రధానంగా పండ్ల తోటల రైతులు తీవ్రాతీ తీవ్రంగా నష్టపోతున్నారు. అరటి, చీనీ,మామిడి రైతులకు కరోనా కాలరాత్రులను మిగులుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో అరటి, చీని రైతులు పంటను అమ్ముకోలేక అల్లాడిపోతున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంట అమ్ముడుపోకపోవడంతో కన్నీళ్లే మిగులుతున్నాయి. చెట్లపైన పండిపోతున్న పంటను చూసి తట్టుకోలేక ఆత్మహత్యల వైపు అన్నదాతులు అడుగులు వేస్తున్నారు. పులివెందుల మండలం చిన్నా రంగపురం గ్రామానికి పౌలు రెడ్డి అనే చినీ రైతు బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు. విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తొమ్మిది ఎకరాల్లో చినీ పంట వేసిన పౌలురెడ్డికి కరోనా కారణంగా తీవ్రనష్టాలు మిగిలాయి. అప్పుల నుంచి బయటపడటం కష్టమని ఆందోళన చెందిన ఆయన చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొనడం విశేషం. పండ్ల రైతులను ఆదుకుంటున్నామని, పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెపుతున్నప్పటికి క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదు. రైతు ఆత్మహత్యపైన ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. జగన్ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నదని వారంటున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!