లాక్ డౌన్ లో మాజీ ప్రధాని మనమడి పెళ్లి

లాక్ డౌన్ లో కూడా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ వివాహం జరిగింది. అత్యంత నిరాడంబరంగా ఫామ్ హౌజ్ లో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి తంతు ముగిసింది. పదుల సంఖ్యలోనే బంధువులు హాజరయ్యారు. మాజీ మంత్రి దేవగౌడ ముద్దుల మనమడైన నిఖిల్ గౌడ వివాహం భారీ ఎత్తున చేయాలని భావించారు. ఎంగేజ్మెంట్ భారీ హంగామా మధ్య జరిగింది. అయితే అనుకోకుండా కరోనా విపత్తు రావడంతో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. పెళ్లి వాయిదా వేయడానికి కుటుంబ సభ్యులు ఇష్టపడకపోవడంతో నిరాడంబరంగా చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే పెళ్లి జరిపించారు. బంధువులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు కొత్త జంటను దీవించాలని కుమారస్వామి మీడియా ద్వారా కోరారు. నిఖిల్ గౌడ కర్ణాటకలో పేరున్న సినిమా హీరో కూడా. కుమారస్వామి మొదటి భార్య కుమారుడే నిఖిల్.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!