లారెన్స్ పెద్ద మనసు

ప్రముఖ డ్యాన్స్ మాస్టార్, నటుడు రాఘవ లారెన్స్ మరో తన పెద్ద మనసు చూపించారు. పేదలకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే లారెన్స్ కరోనా బాదితులను ఆదుకోవడానికి భారీ విరాళం ప్రకటించారు. ఏకంగా మూడు కోట్ల రూపాయలను లారెన్స్ వివిధ వర్గాలకు సాయంగా ఇచ్చారు. ప్రధాని సహాయ నిధికి యాభై లక్షలు, తమిళనాడు సి.ఎం నిధికి యాభై లక్షలు, సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు యాభై లక్షలు , డాన్సర్స్ యూనియన్ కు యాభై లక్షలు విరాళంగా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు 25 లక్షలు ఇచ్చిన లారెన్స్ తన సొంత గ్రామంలోని కూలీలకు ఏకంగా 75 లక్షల సాయం ఇచ్చారు. పి.వాసు దర్శకత్వంలో త్వరలో రాబోతున్న చంద్రముఖి సీక్వెల్ లో లారెన్స్ నటిస్తున్నారు. ఇందుకు కాను ఇచ్చిన మూడు కోట్ల రూపాయల అడ్వాన్స్ ను కరోనా బాదితులకు ఆయన అందించారు. లారెన్స్ ప్రతి సందర్బంలోనూ పేదలను ఆదుకోవడానికి ముందుకు వస్తుంటారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!