రామసుందరరెడ్డి కాదు జస్టిస్ కనగరాజ్

ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జిని నియమించాలని ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసిన వెంటనే కనగరాజ్ నియామకం జరిగిపోయింది. ఆ వెంటనే ఆయన పదవి బాధ్యతలు స్పీకరించారు. తమిళనాడుకు చెందిన జస్టిస్‌ కనగరాజ్ మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన తీర్పులు ఇచ్చారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.

అంతకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఐఎఎస్ అధికారి రామసుందరరెడ్డిని నియమించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో ను రహస్యంగా ఉంచడంతో మొదట గందరగోళం నెలకొన్నది. దీంతో కనగరాజ్ రాష్ట్రానికి వచ్చి బాధ్యతలు తీసుకునేంత వరకు విషయం బయటకు పొక్కలేదు. ఇంత రహస్యంగా ఎందుకు వ్యవహారించాల్సి వచ్చిందో అర్థం కాని పరిస్థితి. మరో వైపు రమేష్ కుమార్ ను తొలగించిన తీరుపైన ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వైసీపీ అరాచకాలను ప్రశ్నించినందుకే ఆయనను తొలగించారని వారు ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న వచ్చిన ఆర్డినెన్స్ పైన న్యాయపోరాటానికి విపక్షాలు సిద్ధమైనట్లు సమాచారం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!