చిరంజీవి తల్లి మానవత్వం

కరోనాను ఎదుర్కొవడానికి ప్రపంచం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రభుత్వాలకు అనేక మంది మానవతా మూర్తులు అండగా నిలబడటానికి వస్తున్నారు. తమ శక్తి మేరకు పేదలకు సాయం చేస్తు ఆదుకుంటున్నారు. కొంత మంది భోజనం అందిస్తుంటే మరికొందరు నిత్యావసరాలు ఇస్తున్నారు. ఇంకొందరు వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే మాస్క్ లు, శానిటైజర్లు అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి కూడా పేదలకు తన వంతు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. తన వయసును కూడా లెక్క చేయకుండా ఆమె స్వయంగా మాస్క్ లను కుడుతున్నారు. తన స్నేహితులతో కలిసి ఆమె మూడు రోజుల్లో 700 మాస్క్ లను కట్టడం విశేషం. ఆ మాస్క్ లను అవసరమున్న పేదలకు అందజేస్తున్నారు. సమాజం పట్ల చిరంజీవి తల్లి తపన చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అంజనా దేవి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!