వెంటిలేటర్ పైన నర్సింగ్ యాదవ్

సినీ నటుడు నర్సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు. 48 గంటలు గడిస్తే కాని పరిస్థితి చెప్పలేమని డాక్టర్ స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘగర్, బీపీ లెవల్స్ తగ్గిపోవడంతో నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాత్రూంలో కింద పడటంతో ఆయనకు దెబ్బతాకిందన్న వార్తలను నర్సింగ్ కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. అనారోగ్య కారణాల వల్లనే ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన భార్య తెలిపారు. నర్సింగ్ యాదవ్ అనేక సినిమాల్లో నటించారు. విలన్ పాత్రలతో పాటు కమెడియన్ రోల్స్ ను ఆయన పోషించారు. ఇటీవల సినిమా అవకాశాలు తగ్గడంతో పెద్దగా తెరపైన కనిపించడం లేదు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!