అల్లు అర్జున్ పుష్ప..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. పుష్ప అన్న పేరుతో ఈ సినిమా రానున్నది. దీనికి సంబందించిన ఫస్టు లుక్ ను కూడా విడుదల చేశారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఈ పోస్టర్ ను విడుదల చేశారు. అల్లు అర్జున్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఫస్టు లుక్ ఫోటోలను ఉంచారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు డైరెక్టర్ . దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫస్టు లుక్ ఆధారంగా చూస్తే పక్కా మాస్ సినిమాగా అనిపిస్తోంది. గతంలో సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ లాగానే పుష్పలో అల్లు అర్జున్ గడ్డం గెటప్ తో ఉండటం విశేషం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!