ఆపన్నహస్తం.. రామోజీరావు

కరోనా విపత్తుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడానికి అనేక మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. చేయగల్గినంత సాయం చేస్తు తమ మంచి మనసును చాటుకుంటున్నారు. ప్రధాని మంత్రి నిధితో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది పారిశ్రామిక వేత్తలు, సినిమా నటులు, ఉద్యోగులు విరాాళాలు అందజేశారు. అయితే వీరందరిని మించి ప్రముఖ వ్యాపార వేత్త, ఈనాడు గ్రూపు అధిపతి రామోజీరావు భారీ సాయాన్ని ప్రకటించారు. ఆయన ఏకంగా తెలుగు రాష్ట్రాలకు ఇరవై కోట్ల విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెరో పది కోట్ల రూపాయలను రామోజీరావు అందజేశారు. ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉండే ఆయన సాయాన్ని ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వానికి ట్రాన్స్ ఫర్ చేయడం విశేషం. తెలుగు వారికి ఏ కష్టమోచ్చిన స్పందించే వారిలో రామోజీరావు ఎప్పుడూ ముందుంటారు. వరదలు, తుఫాన్ లతో పాటు ఎలాంటి విపత్తు వచ్చినా ఆయన భారీ ఎత్తున సాయం చేస్తుంటారు. ఇటీవల వరదల కారణంగా అతలాకుతలం అయిన కేరళ లో పేదలకు రామోజీ ఫౌండేషన్ తరుపున ఇళ్లను నిర్మించి ఇచ్చారు. ఈనాడు పాఠకులతో కలిసి సహాయ నిధిని ఏర్పాటు చేసి ఆ డబ్బును బాధితులకు అందజేయడంలో రామోజీరావు పారదర్శకంగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక మీడియా సంస్థలు, వ్యాపారులు ,బడా రాజకీయ నాయకులు ఉన్నప్పటికి ఈ స్థాయిలో సాయం చేసింది రామోజీరావు మాత్రమే కావడం విశేషం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!