కరీంనగర్ లో మళ్లీ కరోనా కలకలం

కరీంనగర్ మరో సారి ఉలిక్కిపడింది. నగరానికి చెందిన ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలడంతో మరో సారి ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. గతంలో ఇండోనేషియా వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన ఒక వ్యక్తి కుటుంబానికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా క్వారెంటీన్ కు పంపించారు. మొత్తం ఎనిమిది మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెపుతున్నారు. అయినప్పటికి మిగిలిన వారిని కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్న అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ లో కరోనా వ్యాప్తి లేదని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి ఇరవై నాలుగు గంటలు కాకపోతే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!